రేపే సూర్యగ్రహణం..ఇండియాలో ఉంటుందా...టైమింగ్స్ ఇవే..!
భారతదేశ ప్రజలకు బిగ్ అలర్ట్. రేపు సూర్యగ్రహణం ( Solar Eclipse ) ఏర్పడనుంది. 2025 సంవత్సరంలో... సూర్యగ్రహణం
దిశ, వెబ్ డెస్క్: భారతదేశ ప్రజలకు బిగ్ అలర్ట్. రేపు సూర్యగ్రహణం ( Solar Eclipse ) ఏర్పడనుంది. 2025 సంవత్సరంలో... సూర్యగ్రహణం ఏర్పడబోతుండడం ఇదే తొలిసారి. రేపు అంటే సరిగ్గా 29వ తేదీ మార్చి నిండు అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ సూర్యగ్రహణం చాలా శక్తివంతమైందని అంటున్నారు నిపుణులు.
ఏ దేశాల్లో ప్రభావం...?
రేపు ఏర్పాటు అయ్యే సూర్యగ్రహణం ( Solar Eclipse ) ... కొన్ని ప్రాంతాల్లోనే పరిమితం కానుంది. ఆసియా ( Asia), ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, యూరప్ అలాగే అట్లాంటిక్ కు సంబంధించిన పలు దేశాల్లో మాత్రమే ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుందని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. అయితే మన ఇండియాలో మాత్రం ఈ సూర్యగ్రహణం కనిపించబోదని చెబుతున్నారు. భారత కాలమానం ప్రకారం ఇది రాత్రివేళ సంభవిస్తుందట. అందుకే మన దేశంలో ( India ) కనిపించదని స్పష్టం చేస్తున్నారు ఖగోళ సైంటిస్టులు ( Astronomers).
సూర్యగ్రహణం టైమింగ్స్
ఇతర దేశాల కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:17 సంపూర్ణ దశకు చేరుకుంటుందని చెబుతున్నారు. ఇక సాయంత్రం ఆరు గంటల 13 నిమిషాలకు... పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే మన దేశంలో ఈ సూర్య గ్రహణం Solar Eclipse ) కనిపించినప్పటికీ.. గర్భిణీ స్త్రీలు ( Pregnant women ) మాత్రం... రూల్స్ పాటించాలని... తప్పుడు ప్రచారం అయితే సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతుంది. అలాంటి తప్పుడు ఆచారాలు అసలు నమ్మకూడదని సైంటిస్టులు కోరుతున్నారు. కానీ పండితులు మాత్రం... గర్భిణీ స్త్రీలు ( Pregnant women ) రూల్స్ పాటించాలని అంటున్నారు.