Robotic Horse: రోబో "గుర్రం" వచ్చేసింది! హైడ్రోజన్ ఇంజిన్ శక్తితో నడిచే ఏఐ రోబోట్

చైనా, జపాన్, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో రోబోల వాడకం పెరుగుతుంది.

Update: 2025-04-07 07:00 GMT
Robotic Horse: రోబో "గుర్రం" వచ్చేసింది! హైడ్రోజన్ ఇంజిన్ శక్తితో నడిచే ఏఐ రోబోట్
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: చైనా, జపాన్, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో రోబోల వాడకం పెరుగుతుంది. అయితే ఇప్పటి వరకు రకరకాల హ్యుమనాయిడ్ రోబోలు, రోబో కుక్కులను మాత్రమే చూసి ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి రోబో ఏఐ గుర్రం సైతం వచ్చేసింది. గుర్రం మాదిరిగా మనిషిని కూర్చోబెట్టుకొని కొండలు, గుట్టలు ఎక్కేస్తోంది. అవును మీరు విన్నది నిజమే.. జపాన్‌కు చెందిన ప్రపంచ దిగ్గజ వాహనాల కంపెనీ కవాసకీ ఈ గుర్రాన్ని సృష్టించింది.

కొన్ని శతాబ్దాల క్రితం ఎక్కడికి వెళ్లాలన్న గుర్రపు బండ్లు, గుర్రాలపై స్వారీ చేసుకుంటూ ఎంత దూరమైన వెళ్లేవారు. ఆ కాలంలో సరైన రోడ్డు వ్యవస్థ లేకపోవడంతో గుట్టలు, కొండలు, కాలువలు దాటేందుకు గుర్రాలను ఎక్కువగా వాడేవారు. ఈ నేపథ్యంలోనే నేడు టెక్నాలజీని ఉపయోగించి రోబోట్ గుర్రం కోర్లియోని ప్రముఖ వాహనాల కంపెనీ కవాసకీ డిజైన్ చేసింది. ఈ రోబోకు సంబంధించిన వీడియోలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి. జపాన్‌లోని ఒసాకా కన్సాయ్ ఎక్స్‌పో కవాసకీ కోర్లియో 4- కాళ్ల గుర్రాన్ని ఆవిష్కరించింది. హైడ్రోజన్ పవర్ ఇంజిన్ శక్తితో నడిచే రోబోట్ సింహం రూపం ప్రేరణతో డిజైన్ చేశారు. అదేవిధంగా గుర్రపు స్వారీ మాదిరిగానే దానిపై రైడ్ చేయవచ్చు.

అయితే ఈ కవాసకి కోర్లియో అనేది ప్రస్తుతం కాన్సెప్ట్, ప్రోటో‌టైప్ దశలోనే ఉందని కంపెనీ చెబుతోంది. ఈ క్రమంలోనే సంస్థ ఆవిష్కరణలో ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో హెల్మెట్ ధరించిన మనిషి కోర్లియోపై కూర్చోబెట్టుకోని గుట్టలు దిగడం, సింహం మాదిరిగా వేరే చోటుకి జంప్ చేయడం చేస్తోంది. మంచు కొండలపై సైతం జంప్ చేస్తోంది. ఒక వ్యక్తి కూర్చునే వీలు ఉంది. ఇక, వీడియో వైరల్ కావడంతో ఇది త్వరగా మార్కెట్లోకి అందుబాటులోకి రావాలని వాహన ప్రియులు కోరుకుంటున్నారు. కార్టూన్ నెట్‌వర్క్‌లో చూపించే ఓ డ్రాగన్ రోబో ఈ కోర్లియో ఉందని నెటిజన్లు దానికి ఆకర్షితులయ్యారు.

Tags:    

Similar News