ఉక్రెయిన్ యుద్ధంపై యూకే ప్రిన్స్ విలియ‌మ్ రేసిస్ట్ కామెంట్స్‌! నెటిజ‌న్లు ఫైర్‌

ఉక్రేనియన్ కల్చరల్ సెంటర్‌ను సందర్శించిన ప్రిన్స్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. Prince William commented 'bloodshed common in Africa, Asia'

Update: 2022-03-10 10:49 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః రెండో ప్ర‌పంచయుద్ధం త‌ర్వాత ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధంలోనే ఎక్కువ మంది యుద్ధ శ‌ర‌ణార్థులుగా మారార‌ని అంత‌ర్జాతీయ మీడియా క‌థ‌నాలు చెబుతున్నాయి. ఈ యుద్ధం వ‌ల్ల‌ మూడో ప్ర‌పంచ‌యుద్ధం అనివార్య‌మ‌వుతుందేమో అనే ఆలోచ‌న కూడా ప్ర‌పంచవ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇక‌, ఇరు దేశాల మ‌ధ్య ఎనిమిదేళ్ల‌కు పైగా కొన‌సాగుతున్న ఉద్రిక్త‌ల మ‌ధ్య వేల మంది ప్రాణాలు బ‌ల‌య్యాయి. అంత‌కు రెండింత‌ల మంది గాయాల‌పాల‌య్యారు. అయితే, ఇలాంటి హింస ప్ర‌పంచంలో ఎక్క‌డ జ‌రిగినా దాన్ని ఖండించాల్సిందే. ఇది ఏ జాతీ స‌హించ‌లేదు, స‌హించ కూడ‌దు..! అయితే, ఇలాంటి యుద్ధాలు, హింస ఆఫ్రికాలో, ఆసియా ఖండంలో ప్ర‌జ‌లు సాధారణంగానే తీసుకుంటార‌ని యునైటెడ్ కింగ్‌డమ్ రాజ‌కుమారుడు విలియ‌మ్ తాజాగా నోరు జారారు. దీనితో, ప్రిన్స్‌పై పిచ్చి కోపంతో ఊగిపోతున్నారు నెటిజ‌న్లు. జాత్యహంకార వ్యాఖ్య‌లు చేయ‌డం కాబోయే రాజుకు త‌గ‌దంటూ ఫైర్ అవుతున్నారు.

తాజాగా లండన్‌లోని ఉక్రేనియన్ కల్చరల్ సెంటర్‌ను సందర్శించిన ప్రిన్స్ విలియమ్స్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. "ఆసియా, ఆఫ్రికాల‌కు యుద్ధం, ర‌క్త‌పాతం సాధార‌ణమైనా, యూరప్‌లో యుద్ధం, రక్తపాతాన్ని చూడటం ఎంతో కొత్త‌గా ఉంది. మేమంతా మీ వెనుక ఉన్నాం" అని అన్నారు. ఈ వ్యాఖ్యలను బ్రిటిష్ వార్తా సంస్థ, ది ఇండిపెండెంట్ నివేదించింది. ఈ మాట‌ల‌పై సోష‌ల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమ‌వుతోంది. 

Tags:    

Similar News