అబుదాబి పర్యటనలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
అబుదాబి పర్యటనలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మోడీ పాల్గొని మాట్లాడుతూ.. భారత్-యూఏఈ స్నేహబంధం జిందాబాద్ అని నినదించారు.
దిశ, వెబ్‌డెస్క్: అబుదాబి పర్యటనలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మోడీ పాల్గొని మాట్లాడుతూ.. భారత్-యూఏఈ స్నేహబంధం జిందాబాద్ అని నినదించారు. పదేళ్లలో ఏడుసార్లు యూఏఈకి వచ్చానని తెలిపారు. యూఏఈకి వస్తే నా సొంత ఇంటికి వచ్చినట్లు ఉంటుందని అభిప్రాయపడ్డారు. యూఏఈ ప్రజలు తనను ఎంతగానో ఆదరిస్తారని చెప్పారు. భారత్ మిమ్మల్ని చూసి గర్విస్తోందని అన్నారు. యూఏఈ, భారత్‌లోని నలుమూలల నుంచి కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. 30 ఏళ్ల తర్వాత యూఏఈలో ఏడుసార్లు పర్యటించిన తొలి భారత ప్రధానిని తానేనని చెప్పారు.
యూఏఈ అభివృద్ధిలో భారతీయులు కీలకపాత్ర పోషించారని.. యూఏఈ అధ్యక్షుడు గుజరాత్‌కు వచ్చినప్పుడు ఆయనను గౌరవించామని మోడీ గుర్తుచేశారు. యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం తనకు లభించిందంటే .. అది మీ వల్లేనని ప్రధాని అన్నారు. భారత్, యూఏఈ మధ్య సంబంధాలు మరింత వృద్ధి చెందుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. అబుదాబిలో ఆలయాన్ని నిర్మిస్తామని అడిగిన వెంటనే ఒప్పుకున్నామని నరేంద్ర మోడీ తెలిపారు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఆలయం కోసం స్థలం ఇస్తామన్నారని పేర్కొన్నారు.