యుద్దానికి సిద్ధం కండి: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్!

రష్యా-ఉక్రెయిన్, గాజా-ఇజ్రాయెల్ మధ్య యుధ్దం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-12-31 07:40 GMT

ప్యాంగ్యాంగ్: రష్యా-ఉక్రెయిన్, గాజా-ఇజ్రాయెల్ మధ్య యుధ్దం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కొరియాతో ఇక పునరేకీకరణకు ఒప్పుకోబోనని, అవసరమైతే యుద్ధానికి సిద్ధం కావాలని తమ సైన్యాన్ని ఆదేశించినట్టు తెలుస్తోంది. నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో డిసెంబర్ 26 నుంచి 30 వరకు జరిగిన పాలక వర్కర్స్ పార్టీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన కిమ్ ఈ ఆదేశాలు జారీచేసినట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) పేర్కొంది. అవసరమైతే దక్షిణ కొరియా మొత్తం భూభాగంపై అనుబాంబు వేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పినట్టు వెల్లడించింది. అలాగే నూతన సంవత్సరంలో కిమ్ తన లక్ష్యాలను వెల్లడించినట్టు తెలిపింది. ఇందులో ప్రధానంగా రాబోయే ఏడాది మూడు గూఢచార ఉపగ్రహాలను ప్రయోగించడం, మానవ రహిత డ్రోన్‌ల నిర్మాణం, అణు, క్షిపణి ప్రయోగాలను బలోపేతం చేయడం వంటివి ఉన్నాయి. శత్రువులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే..దానికి దీటుగా బదులివ్వాలని కిమ్ సైన్యానికి పిలుపునిచ్చారు. అందుకు ఆయుధ సంపత్తి అవసరమని తెలిపారు. కాగా, గతేడాది ఉత్తరకొరియా అనేక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News