తైవాన్‌లో ప్రారంభమైన పోలింగ్: కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా

చైనా-తైవాన్ మద్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ తైపీలో అధ్యక్ష ఎన్నికలకు శనివారం పోలింగ్ ప్రారంభమైంది.

Update: 2024-01-13 05:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: చైనా-తైవాన్ మద్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ తైపీలో అధ్యక్ష ఎన్నికలకు శనివారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగనుంది. సుమారు 20మిలియన్ల మంది ఓటు వేయనుండగా.. దేశ వ్యాప్తంగా18000 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం కౌంటింగ్ జరగనుండగా..శనివారం అర్ధరాత్రి కల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఓటు వేసేందుకు తైపీ ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారు. మరోవైపు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. రెండు చైనీస్ బెలూన్లు, ఫైటర్ జెట్లను తైవాన్ గగన తలంలో మోహరించింది. ఓటింగ్‌కు ముందు, చైనా ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ లై చింగ్-తేను ప్రమాదకరమైన వేర్పాటువాదిగా అభివర్ణించింది. సైనిక ఘర్షణలను నివారించాలనుకుంటే సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలని ఓటర్లను హెచ్చరించింది. కాగా, లైచింగ్ డెమోక్రటిక్ ప్రొగ్రేసివ్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో ఆయనే గెలిచే అవకాశం ఉన్నట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. 

Tags:    

Similar News