ఆ దేశాల పాస్ పోర్టు మోస్ట్ పవర్ ఫుల్
ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టు కలిగి ఉన్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టు కలిగి ఉన్నట్టు హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ తెలిపింది. ఆయా దేశాల నుంచి 194దేశాలకు వెళ్లేందుకు ఫ్రీ వీసా సౌకర్యం ఉంది. గత ఐదేళ్లుగా జపాన్, సింగపూర్‌లు మొదటి స్థానంలో ఉన్నాయి. ఫిన్లాండ్, స్వీడన్‌లు రెండో స్థానంలో ఉండగా..ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ మూడో ప్లేసులో నిలిచాయి. ఈ జాబితాలో భారత్ 80వ స్థానంలో నిలిచింది. ఇండియా నుంచి ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ సహా 62 దేశాలకు వెళ్లేందుకు ఫ్రీ వీసా వెసులుబాటు ఉంది. మన పొరుగుదేశం పాకిస్థాన్ 101వ దేశంలో ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇక, ఈ లిస్టులో అప్ఘనిస్థాన్ అట్టడుగున ఉంది. ఇక్కడి నుంచి కేవలం 28దేశాలకు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంది.‘వీసా లేకుండా గమ్య స్థానాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య 2006లో 58 ఉంటే.. ప్రస్తుతం(2024లో) 111కి చేరుకుంది. అగ్రస్థానంలో ఉన్న దేశాలు ఇప్పుడు 166కు పైగా ప్రయాణించగలుగుతున్నాయి’ అని హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ చైర్మన్ క్రిస్టియన్ హెచ్ కెలిన్ తెలిపారు.