పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఉరట
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు భారీ ఉరట లభించింది. తోషా ఖానా కేసు తీర్పు మూడు సంవత్సరాల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో మరోసారి ఇమ్రాన్ కోర్టును ఆశ్రయించగా..
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు భారీ ఉరట లభించింది. తోషా ఖానా కేసు తీర్పు మూడు సంవత్సరాల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో మరోసారి ఇమ్రాన్ కోర్టును ఆశ్రయించగా..ఆయన పై విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ చేయగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమర్ ఫరూక్, జస్టిస్ తారిఖ్ మెహమూద్ జహంగిరితో కూడిన డివిజన్బెంచ్ ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఆయన బెయిల్‌పై విడుదల కానున్నారు. కాగా రాష్ట్ర గిఫ్ట్ రిపోజిటరీ అయిన తోషాఖానాకు సంబంధించిన విషయాలలో అవినీతికి పాల్పడినట్లు జిల్లా,సెషన్స్ కోర్టు నిర్ధారించింది. శిక్ష కారణంగా ఇమ్రాన్ ఖాన్ ఏ ప్రభుత్వ పదవికి కూడా అనర్హుడయ్యాడు. ఈ నెల ప్రారంభంలో కోర్టు తీర్పు వెలువడిన కొద్దిసేపటికే ఆయనను అరెస్టు చేశారు.