H1B visa: అమెరికాలో చదువుకునే స్టూడెంట్లకు గుడ్ న్యూస్

అమెరికాలో(US) చదువుకునే విద్యార్థులకు బైడెన్ కార్యవర్గం(Biden administration) గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-12-18 08:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో(US) చదువుకునే విద్యార్థులకు బైడెన్ కార్యవర్గం(Biden administration) గుడ్ న్యూస్ చెప్పింది. విదేశీయులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు(American companies) అవకాశం కల్పిస్తూ నిబంధనల్లో మార్పులు చేసింది. వచ్చే నెల ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ టైంలో బైడెన్‌ కార్యవర్గం ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ప్రకారం ఎఫ్‌-1 విద్యార్థి వీసాలను తేలిగ్గా హెచ్‌-1బీ వీసాలుగా మార్చుకొనే అవకాశం లభిస్తుంది. ఇప్పటివరకు ఎఫ్‌-1 స్టూడెంట్ వీసా(F-1 student visas)లకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగినట్లైంది. దీంతోపాటు గతంలోనే హెచ్‌1బీ (H-1B visa)వీసా పొందినవారి పౌరసత్వం, ఇమిగ్రేషన్‌ సేవలకు సంబంధించిన దరఖాస్తులను వేగంగా ప్రాసెస్‌ చేయనున్నారు. అమెరికాలోని టెక్ సంస్థలకు కార్మికుల అవసరాలు తీర్చేందుకు బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఆ సంస్థలపై పడుతున్న అనవసర ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుంది. ఇక కొత్త విధానంలో లేబర్‌ కండీషన్‌ అప్లికేషన్‌ కచ్చితంగా హెచ్‌1బీ వీసా పిటిషన్‌కు అనుగుణంగా ఉండాలి. ఇక ఈ నిబంధనలు 2025 జనవరి 17 నుంచి అమలుకానున్నాయి.

నిబంధనల్లో మార్పులు

కంపెనీలకు సౌలభ్యం కల్పించేలా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ(Department of Homeland Security) సరికొత్త నిబంధనలను ప్రకటించింది. దీనిప్రకారం నాన్‌ప్రాఫిట్‌, ప్రభుత్వేతర పరిశోధన సంస్థల నిర్వచనం, నిబంధనల్లో మార్పులు చేసింది. కొత్త నిబంధనల కింద ఈ సంస్థలు తమ పనిని ‘రీసెర్చ్’గా పేర్కొనాల్సి ఉంటుంది. ‘‘నాణ్యమైన వృత్తి నిపుణులను నియమించుకొనేందుకు అమెరికా వ్యాపార సంస్థలు హెచ్‌1బీ వీసాలపై ఆధారపడ్డాయి. ఈ మార్పులతో కంపెనీ ఓనర్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకొనేందుకు మరింత సౌలభ్యం లభిస్తుంది. ఇది మన ఆర్థికవ్యవస్థలో పోటీతత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అమెరికా సృజనాత్మకతను మరింత పెంచుతుంది’’ అని హోంల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో ఎన్‌ మేయోర్కాస్‌ పేర్కొన్నారు. ఇక అమెరికా సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జడ్డూ స్పందిస్తూ.. ‘‘1990లో అమెరికా కాంగ్రెస్‌ హెచ్‌1బీ వీసాల జారీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కాగా.. కాలక్రమేణా దేశ ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం ఉండేలా దానిలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు. మరోవైపు, హెచ్‌-1బీ వీసా నాన్‌ ఇమిగ్రెంట్‌ కేటగిరీలోకి వస్తుంది. ముఖ్యంగా భారత్‌, చైనా దేశాలు ఈ వీసా నుంచి చాలా లబ్ధి పొందాయి.

Tags:    

Similar News