EPFO: ఈపీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. అధిక పెన్షన్‌ వివరాల సమర్పణకు గడువు పొడగింపు.!

ఈపీఎఫ్ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-12-18 11:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈపీఎఫ్ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) గుడ్ న్యూస్ చెప్పింది. అధిక పెన్షన్‌కు సంబంధించి వేతన వివరాలను(Salary Details) సమర్పించేందుకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) మరోసారి గడువు పొడిగించింది. కాగా ఇందుకు సంబంధించిన గడువు డిసెంబర్ 31తో ముగియనుండగా.. తాజాగా దాన్ని 2025 జనవరి 31 వరకు పొడగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ(Ministry of Labour) బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గడవు పొడగించాలని ఎంప్లాయర్స్ అసోసియేషన్ నుంచి వినతులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కాగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఇప్పటికీ 3.1 లక్షలపైగా ఉద్యోగుల అధిక పింఛన్ దరఖాస్తులు(Applications) పెండింగ్‌లో ఉన్నాయని కార్మిక శాఖ తెలిపింది. దీంతో గడువును మరోసారి పొడగిస్తున్నామని, పెండింగ్ దరఖాస్తుల్ని వెంటనే పూర్తి చేసేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని పేర్కొంది. 

Tags:    

Similar News