Barack Obama: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. తన మద్దతు ఎవరికో ప్రకటించిన ఒబామా

అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌‌గా మారాయి. ఇప్పటికే అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్టు జో బైడెన్ ప్రకటించారు.

Update: 2024-07-26 11:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌‌గా మారాయి. ఇప్పటికే అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్టు జో బైడెన్ ప్రకటించారు. యువతరానికి అవకాశాలు కల్పించాలి, తన ఆరోగ్యం దృష్ట్యా తప్పుకుంటున్నట్లు చెప్పారు. డెమొక్రాటిక్ పార్టీని, దేశాన్ని ఏకం చేసేందుకే తాను ఎన్నికల నుంచి వైదొలగుతున్నట్టు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ బరిలో నిలిచారు. ఈ క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మద్దతును ప్రకటించారు. ‘క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే విజన్, బలం, క్యారెక్టర్ కమలా హారిస్‌కు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కమలా విజయం సాధించాలి. అమెరికా ప్రజలకు సేవ చేయాలి. చేస్తారనే నమ్మకం నాకు ఉంది. నా సంపూర్ణ మద్దతు ఆమెకే ఇస్తున్నాను’ అని బరాక్ ఒబామా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Tags:    

Similar News