జడ్జిని బెదిరించిన ఇమ్రాన్ ఖాన్.. నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. ఖాటున్ జడ్జి జెబా చౌదరీని బెదిరింపులకు గురి చేసిన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Update: 2023-03-13 15:28 GMT

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. ఖాటున్ జడ్జి జెబా చౌదరీని బెదిరింపులకు గురి చేసిన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు విచారణలో తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ సోమవారం ప్రత్యక్ష విచారణకు హాజరు కాకుండా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనికి కోర్టు నిరాకరించగా, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఈ నెల 29న ఇమ్రాన్‌ను కోర్టులో ప్రవేశపెట్టాలని కోరాయి. గతేడాది ఇమ్రాన్ ఖాన్ ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. తన సహచరుడు షబాజ్ గిల్ కస్టడీలో టార్చర్ ఎదుర్కొన్నాడని ప్రస్తావించారు. ఆ తర్వాత షబాబ్ శిక్ష వేసిన జెబా చౌదరీని ఉద్దేశించి బెదిరింపులకు గురి చేశారు. దీనిపై ఆయా సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News