100 గంటలు నాన్‌స్టాప్‌ కుకింగ్.. గిన్నిస్ రికార్డ్ బద్దలుకొట్టిన నైజీరియన్ లేడీ!

100 గంటలు వంట చేసి నైజీరియాకు చెందిన మహిళా చెఫ్ సరికొత్త రికార్డు సృష్టించింది.

Update: 2023-05-16 11:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: 100 గంటలు వంట చేసి నైజీరియాకు చెందిన మహిళా చెఫ్ సరికొత్త రికార్డు సృష్టించింది. నైజీరియాకు చెందిన హిల్డా బాసి గత గురువారం మధ్యాహ్నం 3 గంటల నుండి నాన్ స్టాప్‌గా వంట చేయడం ప్రారంభించింది. సోమవారం ఉదయం 7.45 నిమిషాల వరకు (100 గంటలు) వంట చేస్తూ గిన్నిస్ రికార్డు సృష్టించింది. దీంతో, 2019లో భారతీయ చెఫ్ లతా టొండన్ నెలకొల్పిన 87 గంటల 45 నిమిషాల గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేసింది.

నైజిరియాకు చెందిన వాణిజ్య నగరమైన లాగోస్‌లోని లెక్కి ప్రాంతంలో బాసి ఈ సాహసం చేసింది. ఇందులో నైజీరియాకు చెందిన ప్రత్యేక వంటలను సిద్ధం చేసింది. ప్రతి 5 నిమిషాలకు విశ్రాంతి తీసుకుంది. వంద గంటలు వంట చేసి బాసి ఆ దేశంలో ప్రత్యేక మహిళగా మారింది. బాసిని చూసేందుకు వేలాది మంది ప్రజలు గుమిగూడారు. ఆణ్ లైన్‌లోను ఆమె వంటల కార్యక్రమం ప్రసారం చేశారు. రికార్డు నెలకొల్పగానే నైజీరియా అధ్యక్షుడు ముహ్మద్ బుహారీ సైతం బాసిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.

Tags:    

Similar News