110 ఏళ్ల క్రితం మునిగిపోయిన‌ Titanic Ship రియ‌ల్ వీడియో రిలీజ్!

80,000 పిక్సెల్‌లు(8k) రిజల్యూషన్‌తో జూమ్ చేసి, చిత్రించారు. Video shows the 15-ton anchor, bronze capstans and boiler.

Update: 2022-09-02 10:41 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః టైటానిక్ పేరు వింటేనే ఆరాధ‌న‌తో పాటు భ‌యం కూడా క‌లుగుతుంది. అయితే, ఈ భారీ ఓడ స‌ముద్రంలో మునిగిన త‌ర్వాత దాన్ని క‌నుక్కోడానికి, ప‌రిశీలించ‌డానికి వివిధ మిష‌న్ల ద్వారా ఎంతో ఖ‌ర్చు చేశారు. ఇందులో భాగంగా, స‌ముద్రంలో ఎనిమిది రోజుల పాటు కొనసాగిన ఇటీవ‌లి యాత్ర ఈ ఏడాది మేలో జరిగింది. ఈ ఎక్స్‌పిడేష‌న్‌లో భాగంగా తీసిని టైటానిక్‌ స‌రికొత్త చిత్రాల‌ను తాజాగా విడుద‌ల చేశారు. వీటిల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ చూడ‌ని చిత్రాలు ఉండ‌గా, అందులో 200-పౌండ్ల బ‌రువున్న టైటానిక్ యాంకర్ గొలుసు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. భారీ పోర్ట్‌సైడ్ యాంకర్‌తో పాటు, 110 సంవత్సరాల క్రితం రెండు భాగాలుగా విరిగి, మునిగిపోయిన ఈ ఓడ‌ సింగిల్-ఎండ్ బాయిలర్‌ను చూపించే కొత్త వీడియో వైరల్ అయ్యింది.

ఈ వీడియోను డైవింగ్ టూర్ కంపెనీ ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ చిత్రీకరించింది. ఇది ఏప్రిల్ 12, 1992 నుండి మనిషి కళ్లకు కనిపించని అల్లికలు, రంగులకు సంబంధించిన విశేషాల‌ను చూపుతుంది. స‌ద‌రు ప‌రిశోధ‌క‌ బృందం నిర్దిష్ట ప్రదేశాలలో దాదాపుగా 80,000 పిక్సెల్‌లు (8k) రిజల్యూషన్‌తో జూమ్ చేసి, చిత్రించారు. టైటానిక్‌కు చెందిన 2వ‌ వార్షిక ప్రయాణంలో ఆ సంస్థ ఈ వీడియో తీసింది. 

Tags:    

Similar News