దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన NASA.. చంద్రునికి మీ పేరును ఉచితంగా పంపించడానికి ఆహ్వానం !

మీ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోవాలనుకుంటున్నారా..? భూమండలంలోనే కాదు.. చంద్రమండలంలోనూ మీ పేరు సుస్థిరంగా వినిపించాలనుకుంటున్నారా..?

Update: 2024-01-10 15:01 GMT

దిశ, ఫీచర్స్ : మీ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోవాలనుకుంటున్నారా..? భూమండలంలోనే కాదు.. చంద్రమండలంలోనూ మీ పేరు సుస్థిరంగా వినిపించాలనుకుంటున్నారా..? అయితే ఇదే మీకు సువర్ణ అవకాశం. పైసా ఖర్చు లేకుండా చందమామ పైకి మీ పేరును పంపించండి. నాసా అందిస్తున్న ఈ సదావకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ వార్తను పూర్తిగా చదవండి.

నాసా (NASA) చంద్రమండలం పైకి VIPER (వోలటైల్స్ ఇన్వెస్టిగేటింగ్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్) ను పంపించడానికి సిద్ధం అయింది. ఈ రోవర్ చంద్రగ్రహం పై చంద్రుని దక్షిణ ధ్రువాన్ని అన్వేషించడం, చంద్రుని పై నీరు, ఇతర రహస్యాలను వెలికితీయడం లక్ష్యంగా పరిశోధనలు చేయనుంది. అయితే ఈ VIPER లూనార్ రోవర్‌లో చంద్రునికి పేరు పంపడానికి, వర్చువల్ బోర్డింగ్ పాస్‌ను స్వీకరించడానికి NASA ప్రజలకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది. దీనిలో భాగంగా ప్రజలు ఉచితంగా పేర్లను పంపవచ్చని ప్రకటించింది. మీరు మీ పేరును చంద్రునికి పంపాలనుకుంటే, దీని కోసం మీరు VIPER అని రాసి మీ పేరును పంపాలి. ఈ పని కోసం మీకు మార్చి 15 రాత్రి 11:59 EST (మార్చి 16 ఉదయం 10:29 am IST) వరకు సమయం ఉంది.

పేర్లను స్వీకరించిన తర్వాత, నాసా సేకరించిన పేర్లన్నింటినీ రోవర్‌కు జత చేసి పంపుతుంది. నాసాకు మీ పేరు తెలియజేయాలంటే www.nasa.gov/send-your-name-with-viperకి వెళ్లాలి, దీని తర్వాత మీరు వెబ్‌సైట్‌లో గెట్ బోర్డింగ్ పాస్ ఎంపికను చూస్తారు. ఈ ఎంపిక పై క్లిక్ చేయడం ద్వారా మీరు మీ పేరు మీద బోర్డింగ్ పాస్ చేయవచ్చు. డిజిటల్ ట్రెండ్స్ నివేదికల ప్రకారం, ఇప్పటివరకు 13 వేల మందికి పైగా చంద్రునిపైకి తమ పేర్లను పంపడానికి నమోదు చేసుకున్నారు.

VIPER మిషన్ అంటే ఏమిటి?

VIPER మిషన్ ద్వారా, NASA చంద్రుని ఉపరితలం పై గతంలో ఎన్నడూ అన్వేషించని భాగాలను అధ్యయనం చేసి, అన్వేషిస్తుంది. VIPER ప్రాజెక్ట్ మేనేజర్ డేనియల్ ఆండ్రూస్ మాట్లాడుతూ ‘‘ఈ మిషన్‌ను చంద్రునిపై ఉన్న వనరులను అర్థం చేసుకోవడాన్ని ఓ గేమ్-ఛేంజర్‌’’గా అభివర్ణించారు.

Tags:    

Similar News