Las Vegas: తప్పిన పెను ప్రమాదం.. విమానంలో చెలరేగిన మంటలు

అమెరికా(USA)లోని కాలిఫోర్నియా(California)లో ఘోర విమాన ప్రమాదం తప్పింది.

Update: 2024-10-06 08:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(USA)లోని కాలిఫోర్నియా(California)లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్(Frontier Airlines) కు చెందిన విమానం శాన్ డియాగో(San Diego) నుంచి లాస్ వెగాస్(Las Vegas) బయలుదేరింది. అయితే ఈ విమానం హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం(Harry Reid International Airport)లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది. విమానాశ్రయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 190 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని,ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(FAA) తెలిపింది. 


Similar News