అధ్యక్ష బాధ్యతల స్వీకరణకు సిద్ధమే.. కమలా హ్యారీస్ కీలక వ్యాఖ్యలు

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కీలక కామెంట్స్ చేశారు.

Update: 2023-09-07 17:21 GMT

జకార్తా : అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కీలక కామెంట్స్ చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ ఈ టర్మ్ ముగిసే వరకు పదవీ బాధ్యతలను నిర్వర్తించలేకపోతే.. వాటిని తీసుకోవడానికి తాను రెడీగానే ఉన్నానని స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు అధ్యక్ష బాధ్యతలను తీసుకోవడం కూడా ఉపాధ్యక్షురాలిగా తన కీలక విధుల్లో ఒకటని వివరించారు. ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియాలోని జకార్తాకు వచ్చిన కమలా హ్యారిస్ విలేకరులతో చిట్ చాట్ చేశారు.

‘‘జో బైడెన్ వయసు 80 దాటుతున్నందున.. ఆయన బాధ్యతలను మీరు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నారా?’’ అని ఓ విలేకరి ప్రశ్నించగా కమలా హ్యారిస్ ఆ ప్రశ్నను దాటవేసే ప్రయత్నం చేశారు. అయినా ఆ విలేకరులు అదే ప్రశ్న అడుగుతుండటంతో.. ‘యెస్’ అని హ్యారిస్ సమాధానం ఇచ్చారు. బైడెన్ బాగానే ఉన్నారు.. బాగానే ఉంటారు కాబట్టి అలాంటివేం జరగవని కమలా హ్యారిస్ స్పష్టం చేశారు.


Similar News