Justin Bieber : తండ్రయిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్

కెనడాకు చెందిన ప్రఖ్యాత పాప్ సింగర్ జస్టిన్ బీబర్ (Justin Bieber) తండ్రయ్యాడు.

Update: 2024-08-24 20:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: కెనడాకు చెందిన ప్రఖ్యాత పాప్ సింగర్ జస్టిన్ బీబర్ (Justin Bieber) తండ్రయ్యాడు.అతని భార్య 27 ఏళ్ల అమెరికన్ మోడల్ హైలీ (Hailey) శనివారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. వెల్కమ్ హోమ్ అంటూ చిన్నారి పాదాల ఫొటోను షేర్ చేశారు. చిన్నారికి జాక్ బ్లూస్ బీబర్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని బీబర్ ఇన్స్టాగ్రామ్(Instagram) వేదికగా తెలియజేశారు.కాగా తాము తల్లిదండ్రులం కాబోతున్నట్టు ఈ ఏడాది ప్రారంభంలోనే బీబర్ దంపతులు ప్రకటించారు. 2018లో బీబర్, హైలీ న్యూయార్క్ లోని కోర్ట్ హౌస్ లో తొలుత పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత దక్షిణ కరోలినాలోని బ్లఫ్టన్ లో తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో మరోసారి వివాహం చేసుకున్నారు. బీబర్ దంపతులకు మగబిడ్డ జన్మించిన కారణంగా వారికి ప్రముఖ నటులు కాటి పెర్రీ అలాగే కైలీ జెన్నర్ అభినందనలు తెలిపారు. 


Similar News