మార్కులు తక్కువ వచ్చాయని ఇంట్లోంచి జంప్.. రూ. కోటి ఇవ్వాలని భారీ స్కెచ్

ఈ మధ్యకాలంలో విద్యార్థులు చాలా మంది ఫెయిల్ అయ్యారని, మార్కులు తక్కువ వచ్చాయని.. సూసైడ్ చేసుకోవడం, ఇంట్లో నుంచి పారిపోవడం లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

Update: 2023-05-22 07:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో విద్యార్థులు చాలా మంది ఫెయిల్ అయ్యారని, మార్కులు తక్కువ వచ్చాయని.. సూసైడ్ చేసుకోవడం, ఇంట్లో నుంచి పారిపోవడం లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కానీ ఓ బాలిక విచిత్రమైన ప్లాన్ వేసి, భారీ డ్రామా ఆడిన సంఘటన తాజాగా పశ్చిమ బెంగాల్‌‌లో చోటు చేసుకుంది. దక్షిణ కోల్‌కతాలోని బన్స్‌ద్రోణి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసింది. ఆ ఎగ్జామ్స్‌లో తక్కువ మార్కులు రావడంతో, పేరెంట్స్ తిడతారని భయంతో తన 6 ఏళ్ల చెల్లెలిని తీసుకుని ఇంట్లో నుంచి పారిపోయింది.

తర్వాత ఓ కొత్త నెంబరు నుంచి.. ‘‘ మీ పిల్లలిద్దర్ని కిడ్నాప్ చేశాం. కోటి రూపాయలు ఇస్తేనే వదిలేస్తాం.’’ అని ఆ అమ్మాయి తండ్రికి మేసేజ్ పంపింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మేసెజ్ వచ్చిన నెంబరు లొకేషన్‌ను కనిపెట్టి అక్కడికి వెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో చివరికి పిల్లిద్దరున్న ప్లేస్‌కు చేరుకున్నారు. ఏమైందని వారిని ప్రశ్నించగా.. పేరెంట్స్ మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని కొప్పాడతారని ఇలా చేశానని బాలిక ఇచ్చిన సమాధానంతో, ఇదంతా డ్రామా అని తెలిసి పోలీసులు షాక్‌కు గురయ్యారు. అనంతరం వారిని పేరెంట్స్‌కు అప్పజెప్పారు.

Tags:    

Similar News