Jimmy Carter : కమలా హరీస్ కు వోట్ వేయడానికి ఆత్రుతతో ఎదురుస్తున్న.. 99 ఏళ్ల US మాజీ అధ్యక్షుడు

US మాజీ అధ్యక్షుడు, 99 ఏళ్ల జిమ్మీ కార్టర్ (Jimmy Carter) వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ కు తన ఓటును వేయడానికి ఆసక్తిగా ఎదురుస్తున్నానని తెలిపాడు.

Update: 2024-08-21 22:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: US మాజీ అధ్యక్షుడు, 99 ఏళ్ల జిమ్మీ కార్టర్ (Jimmy Carter) వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ కు తన ఓటును వేయడానికి ఆసక్తిగా ఎదురుస్తున్నానని తెలిపాడు. కాగా US చరిత్రలో వైట్‌హౌస్‌ను విడిచిపెట్టిన తర్వాత ఎక్కువ కాలం బ్రతికున్న మాజీ అధ్యక్షుడిగా 99 ఏళ్ల జిమ్మీ కార్టర్ రికార్డు నెలకొల్పారు.ఇతను 1977 జనవరి నుండి 1981 జనవరి వరకు డెమొక్రాటిక్ పార్టీ తరుపున అధ్యక్షుడిగా పని చేశారు.అధ్యక్ష ఎన్నికల్లో హారిస్ డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కోవడానికి ఒక నెల ముందు,అనగా అక్టోబర్ 1న కార్టర్ 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాడు.కాగా అమెరికా ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయన్న సంగతి తెలిసిందే.

కాగా మొన్న జరిగిన డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ (DNC) జరిగిన కార్యక్రమంలో డెమొక్రాటిక్ పార్టీ నేతలు కమలా హారిస్ ను అధ్యక్ష అభ్యర్థిగా ఆమోదించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అలాగే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా పలువురు డెమోక్రటిక్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.అయితే జిమ్మీ కార్టర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సింది కానీ ఏడాదిన్నర నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కార్టర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడు. అతని స్థానంలో, మనవడు జాసన్ కార్టర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్బంగా జాసన్ కార్టర్ మాట్లాడూతూ.. "కమలా హారీస్ కు ఏది తప్పో, ఏది సరైనదో తెలుసని, కమలా ఎల్లప్పుడూ సేవ గురించే తప్ప స్వార్థం గురించి ఆలోచించదని తెలిపారు.కమలాకు మా తాత సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని, అలాగే వచ్చే ఎన్నికల్లో కమలా హరీస్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దామని తెలిపారు . 

Tags:    

Similar News