ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం : పోర్న్ స్టార్‌పై నెటిజన్లు ఫైర్
ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధంపై పోర్న్ స్టార్ మియా ఖలీఫా చేసిన ట్వీట్ వివాదస్పదమైంది
దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధంపై పోర్న్ స్టార్ మియా ఖలీఫా చేసిన ట్వీట్ వివాదస్పదమైంది. హమస్ మిలిటెంట్ల దాడులతో మొదలైన రెండు దేశాల యుద్ధం కారణంగా ఇప్పటికే వేల మంది చనిపోగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇదే అంశంపై ట్విట్టర్ వేదికగా మియా ఖలీఫా స్పందించారు. హమాస్ ఉగ్రవాదుల దాడులను సమర్ధిస్తూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘పాలస్తీనాలోని పరిస్థితులను చూసి ఇప్పటికి మీరు ఆ దేశంపై వైపు ఉండకపోతే మీరు తప్పుడు మార్గంలో ఉన్నారని అర్థం. అలాంటి వాటికి కాలమే తగిన సమాధానం చెబుతుంది.’ అంటూ మియా ఖలీఫా ట్వీట్ చేసింది.
హమాస్ దళాలను స్వాతంత్ర సమరయోధులుగా పోల్చింది. ఇక మియా ఖలీఫా తీరుతో కెనడియన్ బ్రాడ్ కాస్టర్, రేడియో హోస్ట్ టాడ్ షాపిరో ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. మియా ఖలీఫా ట్వీట్ భయంకరమైనదని, మంచి మనిషిలా మియా మారాలని ట్వీట్‌లో షాపిరో తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో మనుషుల మధ్య శాంతి నెలకొనేలా స్పందించాలని, మీరు మంచి వ్యక్తిగా మారాలని ప్రార్థిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
మియా ఖలీఫా పోస్ట్‌లపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నీ కోసం వన్ వే ఫ్లైట్ టికెట్ కొని పంపిస్తా ఆ దేశానికి వెళ్లు మరి..అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ఫ్రీడమ్ ఫైటర్లు గొంతులు కోస్తారా.. చిన్నారులను చిదిమేస్తారా అంటూ మరో నెటిజన్ ఫైర్ అయ్యాడు. ఇక, ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య బీకర పోరు కారణంగా ఇప్పటి వరకు 1200 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో 500 మంది, హమాస్ దాడుల్లో 700 మంది చనిపోయారు. 130 మందిని బందీలుగా పట్టుకున్నామని హమాస్ మిలిటెంట్లు తెలిపారు.