ఇజ్రాయెల్, హమాస్ వార్ : పాలస్తీనాకు మద్దతు తెలిపిన కాంగ్రెస్
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌లోకి చొరబడి దాడికి పాల్పడటంతో భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌లోకి చొరబడి దాడికి పాల్పడటంతో భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కాంగ్రెస్ స్పందించింది. సీడబ్ల్యూసీ మీటింగ్ పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాదంపై విచారం వ్యక్తం చేసింది. వెంటనే రెండు దేశాలు కాల్పుల విరమణ చేసి చర్చలు జరపాలని కోరింది. అయితే పాలస్తీనా ప్రజల హక్కుల కోసం తమ మద్దతును తెలుపుతూ కాంగ్రెస్ తీర్మానం చేసింది. అంతకు ముందు పాలస్తీనా ఉగ్రవాద సంస్థల దాడులను కాంగ్రెస్ ఖండించింది. కాంగ్రెస్ ఆమోదించిన తీర్మానంలో రెండు దేశాల యుద్ధం కారణంగా వెయ్యి మందికి పైగా మరణించినందుకు విచారం వ్యక్తం చేసింది. పాలస్తీన ప్రజలకు స్వయం పరిపాలన, ఆత్మగౌరవం, జీవించే హక్కుల కోసం దీర్ఘకాలిక మద్ధతును తెలిపుతున్నట్లు ప్రకటించింది. ఇక తమ దేశంపై హమాస్ ఉగ్రవాదులు చొరబడి దాడులకు తెగబడటంతో