లెబనాన్‌లో ఏ ప్రాంతాన్ని విడిచిపెట్టని ఇజ్రాయెల్

లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుసగా దాడులు చేస్తూనే ఉంది. నగరం, గ్రామం అని ఏ ప్రాంతాన్ని కూడా వదిలి పెట్టకుండా నిరంతరం బాంబులతో విరుచుకుపడుతూనే ఉంది.

Update: 2024-09-25 15:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుసగా దాడులు చేస్తూనే ఉంది. నగరం, గ్రామం అని ఏ ప్రాంతాన్ని కూడా వదిలి పెట్టకుండా నిరంతరం బాంబులతో విరుచుకుపడుతూనే ఉంది. ఫలితంగా దాదాపు 50 మందికి పైగా పిల్లలు చనిపోయినట్లు సమాచారం. లెబనాన్‌లో స్థానిక వ్యక్తి ఒకరు మాట్లాడుతూ, నగరం, గ్రామం, సూపర్ మార్కెట్, మెడికల్ స్టోర్, ఆసుపత్రి మొదలగు అన్నింటిని ఇజ్రాయెల్ నాశనం చేస్తుంది. నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి, చాలా మంది చనిపోగా, కొందరు కాళ్లు, చేతులు కోల్పోయి విగతజీవులుగా ఉన్నారని తెలిపాడు. ఇదిలా ఉంటే బుధవారం నాటి దాడుల్లో 23 మంది మరణించారని, పలువురు గాయపడ్డారని లెబనాన్ అధికారికంగా తెలిపింది.

అక్కడి ప్రజలు హిజ్బుల్లాకు సపోర్ట్‌గా నిలబడి ఉన్నట్లు తెలుస్తుంది. ఒక పౌరుడు మాట్లాడుతూ, రక్తదానం చేసేందుకు క్యూలు కడుతున్నారు, కొందరు తమకు రెండు కళ్లు ఉన్నాయని, ఒకటి దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, లేదంటే రెండు కిడ్నీలు ఉన్నాయని, ఒకటి దానం చేసేందుకు సిద్ధమని కొందరు అంటున్నారు.. అలాంటి స్ఫూర్తిని మనం చూస్తున్నాం, సమాజంలో ఉన్న ఈ ఉత్సాహం శత్రువుతో గట్టి పోరాటానికి సిద్ధంగా ఉందనడానికి నిరూపితం అని అతను తెలిపాడు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు సుమారు 600 మంది సాధారణ ప్రజలు మరణించారు, అలాగే 1,800 నుండి 2,000 మంది గాయపడ్డారు.


Similar News