Israel Helicopter Crash : గాజాలో కూలిన ఇజ్రాయెల్ సైనిక హెలికాప్టర్.. కారణం అదే ?

దిశ, నేషనల్ బ్యూరో : పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ ఆర్మీకి షాకిచ్చే ఓ ఘటన బుధవారం చోటుచేసుకుంది.

Update: 2024-09-11 19:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ ఆర్మీకి షాకిచ్చే ఓ ఘటన బుధవారం చోటుచేసుకుంది. గాజాలోని రఫా ప్రాంతం సమీపంలో ఇజ్రాయెల్ సైనిక హెలికాప్టర్ అదుపుతప్పి కూలిపోయింది. ఈ ఘటనలో అందులోని ఇద్దరు ఇజ్రాయెలీ సైనికులు చనిపోయారు. హమాస్‌ ఉగ్రవాదులతో పోరాడుతూ గాయపడిన ఇజ్రాయెలీ సైనికులను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సైనిక హెలికాప్టర్ రఫా ప్రాంతానికి చేరుకుంది.

గాయపడిన పలువురు సైనికులను లోపలికి ఎక్కించుకొని హెలికాప్టర్‌ తిరిగి గాల్లోకి ఎగిరే ప్రక్రియను మొదలుపెట్టగానే అదుపుతప్పి కూలిపోయింది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మిస్సైల్‌ను హమాస్ మిలిటెంట్లు సంధించడం వల్లే హెలికాప్టర్ కూలిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ ఆర్మీ మాత్రం సాంకేతిక లోపం వల్లే తమ హెలికాప్టర్ కూలిందని అంటోంది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లోని ఇద్దరు ఇజ్రాయెలీ సైనికులు చనిపోగా, ఏడుగురికి గాయాలయ్యాయని వెల్లడించింది.


Similar News