Sheikh Hasina :షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం మరో షాక్
దిశ, నేషనల్ బ్యూరో : భారత్‌లో ఉంటున్న మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు షాక్ ఇచ్చే మరో నిర్ణయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో : భారత్‌లో ఉంటున్న మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు షాక్ ఇచ్చే మరో నిర్ణయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకుంది. హసీనాకు చెందిన రాజకీయ పార్టీ ‘అవామీ లీగ్’ అనుబంధ విద్యార్థి సంఘం ‘బంగ్లాదేశ్ ఛాత్ర లీగ్’పై నిషేధాన్ని విధించింది. ఈ ఏడాది జులై నుంచి ఆగస్టు మధ్యకాలంలో దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్న ఎంతోమంది విద్యార్థుల మరణాలకు కారణమైనందున సదరు విద్యార్థి సంఘంపై బ్యాన్ విధిస్తున్నట్లు బంగ్లా సర్కారు తెలిపింది.
15 ఏళ్ల షేక్ హసీనా పాలనా కాలంలోనూ ‘బంగ్లాదేశ్ ఛాత్ర లీగ్’ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చాలా దారుణాలకు తెగబడిందని ఆరోపించింది. బంగ్లాదేశ్ యాంటీ టెర్రర్ చట్టం కింద ఈ నిషేధాన్ని విధిస్తున్నట్లు పేర్కొంది. ఈమేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.