Iran - Israel War : ఈ వారమే ఇరాన్ మీపై దాడి చేయొచ్చు..ఇజ్రాయెల్ కు అమెరికా హెచ్చరిక

గత జూలై 31న టెహ్రాన్‌లో హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్ హానియే హత్య, లెబనాన్‌లో హెజ్బొల్లా సీనియర్‌ కమాండర్‌ ఫౌడ్‌ షుక్‌న్రు ఇజ్రాయెల్‌ హతమార్చడంతో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-13 22:39 GMT

దిశ, వెబ్‌డెస్క్ : జూలై 31న టెహ్రాన్‌లో హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్ హానియే హత్య, లెబనాన్‌లో హెజ్బొల్లా సీనియర్‌ కమాండర్‌ ఫౌడ్‌ షుక్‌న్రు ఇజ్రాయెల్‌ హతమార్చడంతో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ హత్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడులు చేపడుతామని ఇరాన్ ఇది వరకే ప్రకటించింది ఈ వారంలోనే ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ లేదా దాని అనుకూల సంస్థలు దాడికి పాల్పడవచ్చని అమెరికా పేర్కొన్నది. ఈ మేరకు వైట్‌హౌజ్‌ అధికార ప్రతినిధి జాన్‌ ఎఫ్‌ కిర్బి కీలక ప్రకటన చేశారు.

తమ భూభాగంలో ఇజ్రాయెల్‌ సైనిక చర్యకు పాల్పడటంపై ఇరాన్‌ జీర్ణించుకోలేక పోతుంది.ఎలాగైనా ఇజ్రాయెల్‌పై దాడులు చేపట్టాలని ఇరాన్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ వంటి దేశాధినేతలు ఇరాన్‌ అధ్యక్షుడికి కాల్ చేసి ప్రస్తుతం నెలకొంటున్న ఉద్రిక్తత పరిస్థితులను చల్లార్చాలని, ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణకు సహకరించాలని ఇరాన్ అధ్యక్షున్ని కోరిన ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఏం జరగబోతుందోన్న టెన్షన్ నెలకొంది. కాగా మంగళవారం ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడికి పాల్పడింది. ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరం టెల్‌ అవీవ్‌ లక్ష్యంగా రెండు M90 రాకెట్లను ప్రయోగించింది. అయితే ఒక రాకెట్ మాత్రం నగరంలోకి వచ్చినట్టు శబ్దం వచ్చిందని , ఈ రాకెట్ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్థానిక మీడియా తెలిపింది. ఇంకో రాకెట్‌ మాత్రం ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చేరుకోలేదని పేర్కొన్నది. కాగా.. మంగళవారం ఇజ్రాయెల్‌ గాజా లోని దక్షిణ, మధ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 19 మంది పాలస్తీనా ప్రజలు మరణించినట్టు సమాచారం.

Tags:    

Similar News