‘చిమ్‌టూ’కి మరణం లేదు! ఇంటర్నెట్ సెన్సేషనల్ మీమ్ డాగ్ కబోసు ఇకలేదు

Update: 2024-05-24 10:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంటర్నెట్ సెన్సేషన్ చిక్కటి చిరునవ్వుతో మీమ్స్‌లో నవ్వించిన వైరల్ డాగ్ కబోసు ఇకలేదు. డాగ్ మీమ్‌గా సెన్సేషన్ సృష్టించిన జపనీస్ షిబా ఇను జాతికి చెందిన 19 ఏళ్ల కబోసు అక మృతి చెందినట్లు తెలిసింది. డాగ్ చనిపోవడానికి ముందు రోజు రాత్రి “ఎప్పటిలాగే అది రైస్ తిని పుష్కలంగా నీళ్ళు తాగింది” అని యజమాని వెల్లడించాడు. డాగ్ మరుసటి రోజు నిద్రలోనే "నిశ్శబ్దంగా" మరణించింది. అని డాగ్ యజమాని పేర్కొన్నారు.

Click Here For Twitter Post..

అయితే, ఈ డాగీ సోషల్ మీడియాలోనే కాదు.. క్రిప్టోకరెన్సీలో కూడా ఫేమస్, క్రిప్టోకరెన్సీలో డాగీ కాయిన్ కూడా ఒకటి. దాని సింబల్‌గా కబోసు ముఖాన్నే వాడారు. క్రిప్టో ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ డాగీ కాయిన్. బిట్ కాయిన్ తర్వాత ఎక్కువ మంది గూగుల్‌లో సెర్చ్ చేసిన క్రిప్టో కరెన్సీ డాగ్ కాయిన్ మాత్రమే.

మరోవైపు దీనిలాగే చీమ్స్ పేరుతో పాపులర్ అయిన బాల్ట్జ్ డాగ్ కూడా ఇటీవలే చనిపోయింది. అది కూడా 2023 ఆగస్టు నెలలో క్యాన్సర్‌తో చనిపోయింది. తాజాగా కబోసు కూడా చనిపోవడంతో నెటిజన్లు విషాదంలో ఉన్నారు. కాగా, ఈ డాగ్‌ తెలుగు మీమ్స్‌లో కూడా ఎంతో పాపులర్, తెలుగులో ఈ డాగ్‌ను చిమ్‌టు అని ముద్దుగా పిలుచుకుంటారు. చిమ్‌టుకి మరణం లేదని నెటిజన్లు వాటికి నివాళులు అర్పించారు.

Click Here For Twitter Post..

Tags:    

Similar News