నేడు అంతర్జాతీయ సోదర, సోదరీమణుల దినోత్సవం..

Update: 2023-05-02 03:25 GMT

దిశ, వెబ్ డెస్క్: నేడు అంతర్జాతీయ సోదర, సోదరీమణుల దినోత్సవం. సృష్టిలో అన్నా చెల్లెళ్ల బంధం చాలా గొప్పదిగా చెప్తుంటారు. అన్న, సోదరిమణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారికి రక్షణను కల్పిస్తూ కష్టాల నుంచి కాపాడుతాడు. అన్న, చెల్లికి తండ్రి తర్వాత ఎక్కువగా ప్రేమించే వ్యక్తిగా భావిస్తారు. అలాగే కొన్ని విషయాలు తల్లితండ్రులతో కూడా చెప్పుకోలేనివి సోదరులతో పంచుకుంటారు. అంత గొప్ప బంధం అన్నా చెల్లెళ్ల అని అంటుంటారు. అంతర్జాతీయ సోదర సోదరీమణుల దినోత్సవ కల్చర్ ముందుగా యునైటెడ్ స్టేట్స్ నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత అన్ని దేశాలకు విస్తరించింది. యునైటెడ్ స్టేట్స్‌లో దీనికి సమాఖ్య గుర్తింపు లేదు, అయినప్పటికీ దీనిని మార్చేందుకు సిబ్లింగ్స్ డే ఫౌండేషన్ కృషి చేస్తోంది. దీనిని 1998 నుండి, 49 రాష్ట్రాల గవర్నర్‌లు తమ రాష్ట్రంలో తోబుట్టువుల దినోత్సవాన్ని గుర్తించేందుకు అధికారికంగా ప్రకటనలు జారీ చేసినట్లు సమాచారం.

Tags:    

Similar News