మెరపి అగ్నిపర్వతం విస్ఫోటనం.. 7 కిలోమీటర్ల మేరా..

ఇండోనేషియాలోని అత్యంత చురుకైన మెరపి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతుంది.

Update: 2023-03-12 06:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేషియాలోని అత్యంత చురుకైన మెరపి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతుంది. దీంతో అగ్నిపర్వతం నుంచి వచ్చే లావా, దట్టమైన పొగలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. దీని ప్రభావం సుమారు. 4.3 మైళ్లు(7 కిలోమీటర్ల) వరకు ఉంది. జావా, వేడి బూడిద మేఘాలు, రాక్, లావా, వాయువుల మిశ్రమం 7 కిలోమీటర్ల ప్రాంతాన్ని పూర్తిగా కప్పివేశాయి.

దీంతో అధికారులు అగ్నిపర్వతం పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే అటువైపు వెళ్ళే అన్ని మార్గాలను మూసివేశారు. కాగా 2010 ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు సుమారు. 347 మంది మరణించగా.. 20000 మంది గ్రామస్తులు నిరాశ్రయులయ్యారు.

Tags:    

Similar News