నూతన శిఖరాలకు భారత్-అమెరికా భాగస్వామ్యం: యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్

సాంకేతిక, ఇతర రంగాల్లో సహకారంతో భారత్-అమెరికాల మధ్య భాగస్వామ్యం నూతన శిఖరాలకు చేరుకుందని యూఎస్ జాతీయ భద్రతా సలహాదాలు జేక్ సల్లివన్ అన్నారు.

Update: 2024-04-10 03:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సాంకేతిక, ఇతర రంగాల్లో సహకారంతో భారత్-అమెరికాల మధ్య భాగస్వామ్యం నూతన శిఖరాలకు చేరుకుందని యూఎస్ జాతీయ భద్రతా సలహాదాలు జేక్ సల్లివన్ అన్నారు. వార్తా సమావేశంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాన్, ఈజిప్ట్, యూఏఈ, ఇథియోపియా బ్రిక్స్‌లో చేరడం, సౌదీ అరేబియా సైతం దానిలోభాగం కావడానికి ఆలోచిస్తున్న నేపథ్యంలో, ప్రపంచంలో అమెరికన్ నాయకత్వం క్షీణించడంపై అడిగిన ప్రశ్నలకు జేక్ బదులిచ్చారు. యూఎస్‌కు ప్రపంచంలోని అనేక దేశాలతో మెరుగైన సంబంధాలున్నాయని తెలిపారు.

నాటోను గతంలో కంటే మరింతగా విస్తరించామని చెప్పారు. యూఎస్, జపాన్, పిలిప్పీన్స్ మధ్య ఈ వారంలో ఓ త్రైపాక్షిక ఒప్పందం జరుగుతుందని వెల్లడించారు. ఇండో-పసిఫిక్ అంతటా గమనిస్తూ యూఎస్ సంప్రదాయ మిత్రదేశాలతోనే కాకుండా, వియత్నాం, ఇండోనేషియా, ఆసియాన్ వంటి దేశాలతోనూ సంబంధాలను మెరుగుపర్చుకున్నామని స్పష్టం చేశారు. వచ్చే నెలలో బైడెన్ కెన్యా అధ్యక్షుడిని యూఎస్ పర్యటనకు స్వాగతిస్తారని, ఇది ఎంతో చారిత్రక క్షణమని తెలిపారు. అమెరికాలో జరిగిన అన్ని శిఖరాగ్ర సమావేశాల్లో ఆఫ్రికా నాయకులందరికీ యూఎస్ ఆతిథ్యం ఇచ్చినట్టు గుర్తు చేశారు. మౌలిక సదుపాయాలు, భౌతిక, డిజిటల్, ఇంధన మౌలిక సదుపాయాలలో అమెరికా పెట్టుబడులను పెంచిందని చెప్పారు.  

Tags:    

Similar News