India-Australia: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొంటాం: భారత్-ఆస్ట్రేలియా

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని భారత్-ఆస్ట్రేలియా పేర్కొన్నాయి.

Update: 2024-08-13 16:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని భారత్-ఆస్ట్రేలియా పేర్కొన్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో, ఉగ్రవాదాన్ని సమగ్రంగా, స్థిరమైన పద్ధతిలో ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. సీమాంతర ఉగ్రవాదానికి టెర్రరిస్ట్ ప్రాక్సీలను ఉపయోగించడాన్ని చర్చల్లో ఖండించారు. ఈ సమావేశంలో దేశీయ, ప్రాంతీయ, ప్రపంచ ఉగ్రవాద ముప్పు అంచనాపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.

ఉగ్రవాదులు కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, వారి ప్రయోజనాల కోసం ఇంటర్నెట్ దుర్వినియోగం, రాడికలైజేషన్, యు టెర్రర్ ఫైనాన్సింగ్, వ్యవస్థీకృత నేరాలు ఇతర ఉగ్రవాదానికి సంబంధించిన తీవ్రవాద సవాళ్లను కట్టడి చేయడానికి కలిసికట్టుగా పోరాడాలని రెండు వర్గాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ సమావేశంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వ్యాఖ్యానిస్తూ, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కొనసాగుతున్న సహకారం భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో ముఖ్యమైన అంశం అని తెలిపింది.

Tags:    

Similar News