ప్రపంచంలోనే 'ది బెస్ట్ కంట్రీ'.. అదే..!

'స్విస్'(Switzerland).. ఈ పేరు వినగానే మనకు యూరప్ ఖండంలోని ప్రసిద్ధ పర్వతాల్లో ఒకటైన అందమైన ఆల్ప్స్(The Alps) పర్వతాలు, ప్రకృతి రమణీయత కలిగిన సుందరమైన ప్రదేశాలు మన కళ్ల ముందు మెదులుతాయి.

Update: 2024-09-10 12:36 GMT

దిశ, వెబ్ డెస్క్: 'స్విస్'(Switzerland).. ఈ పేరు వినగానే మనకు యూరప్ ఖండంలోని ప్రసిద్ధ పర్వతాల్లో ఒకటైన అందమైన ఆల్ప్స్(The Alps) పర్వతాలు, ప్రకృతి రమణీయత కలిగిన సుందరమైన ప్రదేశాలు మన కళ్ల ముందు మెదులుతాయి.ఇవే కాక స్విట్జర్లాండ్(Switzerland) అనగానే.. రాజకీయ నాయకులు 'నల్ల ధనం'(Black money) ను దాచుకునే ప్రదేశం లాంటి విషయాలు కూడా గుర్తుకువస్తాయి. వీటన్నింటికీ మించి ప్రపంచంలోని పర్యాటకులందరికీ స్విట్జర్లాండ్ 'స్వర్గ ధామం' అని అంటే అతిశయోక్తి కాదేమో.! అయితే.. తాజాగా ఈ దేశం ప్రపంచంలోనే ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. అదేంటంటే.. "యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్(US news and world report) విడుదల చేసిన ఉత్తమ దేశాల ర్యాంకులు-2024 (Best countries rankings-2024) లో 'స్విట్జర్లాండ్' మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. దీంతో వరుసగా మూడోసారి నంబర్ వన్ దేశంగా స్విట్జర్లాండ్ నిలిచి".. 'ఔరా' అనిపించింది.

కాగా, యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్.. ప్రపంచంలో ఉన్న మొత్తం 80 దేశాలతో జాబితాను రూపొందించింది. ఈ రిపోర్ట్ అనేది దేశ వారసత్వం, సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన నాణ్యతా పరిమాణాలు, సాహసం వంటి పలు అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్ ను విడుదల చేస్తుంది. ఇలా అత్యధిక విభాగాల్లో టాప్ ప్లేస్ లో ఉన్న స్విస్.. ఈ ర్యాంకింగ్స్ లో తొలి స్థానాన్ని దక్కించుకోగా, ఇప్పటివరకు ఈ దేశం 7 సార్లు 'బెస్ట్ కంట్రీ' గా మొదటి ర్యాంకును పొందింది.

మరి, ఈ జాబితాలో భారత్ ర్యాంక్ ఎంతంటే..?

ఈ జాబితాలో భారత్(India) '౩౩' వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే.. భారత్ ఇప్పుడు 3 స్థానాలు కిందకు పడిపోయింది. ఈ జాబితాలో రెండవ స్థానంలో జపాన్ నిలవగా.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు వరుసగా తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. కాగా ఇప్పటివరకు ఆసియా నుంచి.. జపాన్, సింగపూర్, చైనా, సౌత్ కొరియా దేశాలు మాత్రమే టాప్-25 లో చోటును దక్కించుకోగలిగాయి.


Similar News