‘నేను ఇంకా బతికే ఉన్నా’

అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన పోప్ ఫ్రాన్సిస్ శనివారం డిశ్చార్జి అయ్యారు. తాను భయపడలేదని... "I'm Still Alive," Says Pope Francis As He Leaves Hospital

Update: 2023-04-01 13:09 GMT

రోమ్: అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన పోప్ ఫ్రాన్సిస్ శనివారం డిశ్చార్జి అయ్యారు. తాను భయపడలేదని, ఇంకా బతికే ఉన్నానని మీడియాకు వెల్లడించారు. బుధవారం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన వేగంగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. యాంటిబయాటిక్స్ కు వేగంగా స్పందించారని తెలిపారు. తాను పూర్తిగా కోలుకున్నానని తెలియజేసేలా పోప్ వాకింగ్ స్టిక్ సహాయంతో కారు వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. మరోవైపు తాను కోలుకోవాలని ప్రార్థించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

Also Read..

దాయాది దేశంలో హిందూ వైద్యుడి దారుణ హత్య 

Tags:    

Similar News