Putin : మిస్సైళ్లను అక్కడ మోహరించారో.. కాచుకోండి.. అమెరికాకు పుతిన్ వార్నింగ్

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు.

Update: 2024-07-28 13:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. జర్మనీ లేదా ఏదైనా ఐరోపా దేశంలో మిస్సైళ్లను మోహరించాలనే నిర్ణయానికి అమెరికా వస్తే.. తాము ఇంటర్మీడియట్ రేంజ్, షార్ట్ రేంజ్ అణ్వాయుధాల ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తామని ఆయన హెచ్చరించారు. ఆదివారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన నౌకాదళ పరేడ్‌లో పాల్గొన్న పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘రష్యాకు సమీపంలో మిస్సైళ్లను మోహరించాలని అమెరికా భావిస్తే ఊరుకోం.. ఇంటర్మీడియట్ రేంజ్, షార్ట్ రేంజ్ అణ్వాయుధాల తయారీపై ఇరుదేశాలు గతంలో విధించుకున్న నిషేధం నుంచి మాకు విముక్తి లభించిందని అనుకుంటాం. వాటి తయారీని మొదలుపెడతాం’’ అని ఆయన వెల్లడించారు. ఇప్పటికే రష్యాలో అలాంటి చాలా ఆయుధ వ్యవస్థల అభివృద్ధి చివరి దశలో ఉందన్నారు. ‘‘అమెరికా ప్రణాళికలను పసిగట్టి మేం కూడా తప్పకుండా వాటిని తిప్పికొట్టే వ్యూహంతో ముందుకు సాగుతాం’’ అని పుతిన్ స్పష్టంచేశారు. కాగా, 500 కిలోమీటర్ల నుంచి 5,500 కిలోమీటర్ల రేంజులోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణుల తయారీని ఇరుదేశాలు నిలిపివేయాలని తెలిపే ఒక ఒప్పందంపై 1987లో అమెరికా, రష్యా సంతకం చేశాయి. 

Tags:    

Similar News