అర్జెంటీనాలో భారీ భూకంపం.. 6.5 తీవ్రత
దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనాలో భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ఈ భూకంపాన్ని ధృవీకరించింది.
దిశ, వెబ్ డెస్క్:దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనాలో భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ఈ భూకంపాన్ని ధృవీకరించింది. యుఎస్‌జీఎస్ ప్రకారం, అర్జెంటీనాలోని శాన్ ఆంటోనియో డి లాస్ కోబ్రెస్‌లో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. అర్జెంటీనాలోని శాన్ ఆంటోనియో డి లాస్ కోబ్రెస్‌కు ఉత్తర వాయువ్యంగా 84 కి.మీ దూరంలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇప్పటికి వరకు భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నిర్ధారించలేదు.
చిలీలోని ఇక్విక్‌లోనూ..
ఇదే సమయంలో.. చిలీలోని ఇక్విక్‌లో కూడా 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం ఇక్విక్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. చిలీకి ఆగ్నేయంగా 519 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.