Hotel collapsed: జర్మనీలో కుప్పకూలిన హోటల్.. ఇద్దరు మృతి

పశ్చిమ జర్మనీలో ఒక హోటల్‌లో కొంత భాగం కుప్పకూలగా ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు బుధవారం తెలిపారు.

Update: 2024-08-07 13:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ జర్మనీలో ఒక హోటల్‌లో కొంత భాగం కుప్పకూలగా ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు బుధవారం తెలిపారు. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు పశ్చిమాన 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రోవ్‌లోని హోటల్‌లోని ఒక అంతస్తు మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి సహయక చర్యలు ప్రారంభించారు. ప్రమాద సమయంలో లోపల 14 మంది ఉన్నట్లు తెలుస్తుంది. వారిలో ఐదుగురు బయటపడ్డారు. అయితే ఒక మహిళ, ఒక పురుషుడు మరణించారు. మిగిలిన వారు శిథిలాల క్రింద ఉండగా వారిని కూడా బయటకు తీసే పనులు జరుగుతున్నాయని పోలీసు అధికార ప్రతినిధి జోర్గ్ టెష్ బుధవారం చెప్పారు.

శిథిలాలు భారీగా పడటంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా ఉందని, స్థానిక పరిసరాల నుండి 31 మంది నివాసితులను ఖాళీ చేయించినట్లు జోర్గ్ టెష్ తెలిపారు. ప్రస్తుతం అక్కడ శిథిలాలను తొలగిస్తున్నారు. 250 మందికి పైగా రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ఘటనలో చిక్కుకున్న వారిలో ముగ్గురు డచ్ కుటుంబం కూడా ఉన్నట్లు డచ్ మీడియా పేర్కొంది. తల్లి, బిడ్డ సజీవంగా బయటకు రాగా, అయితే తండ్రి ఇంకా చిక్కుకుపోయాడని డచ్ జాతీయ వార్తా సంస్థ ANP తెలిపింది.

Tags:    

Similar News