Hindu Temple Attack: అమెరికాలో మరోసారి హిందూ దేవాలయంపై దాడి..ఖలిస్థాన్ మద్దతుదారులే చేసుంటారని అనుమానం..!
అమెరికా(US)లో మరోసారి హిందూ దేవాలయంపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్:అమెరికా(US)లో మరోసారి హిందూ దేవాలయంపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.న్యూయార్క్(New York)లోని మెల్‌విల్లే(Melville)లో ఉన్న 'BAPS స్వామినారాయణ్ దేవాలయం(BAPS Swaminarayan Temple)'పై ఆదివారం రాత్రి దుండగులు దాడి చేశారు.ఈ దాడిలో టెంపుల్ లోని ఓ భాగాన్ని దుండగులు ధ్వంసం చేశారు.ఆలయం గోడలపై 'మోడీ టెర్రరిస్ట్,మోడీ ముర్దాబాద్(Modi Terrorist,Modi Murdhabad)' అంటూ రాతలు రాశారు.భారత ప్రధాని(Indian PM) నరేంద్ర మోదీ(Narendra Modi) అమెరికా పర్యటనకు కొద్ది రోజుల ముందు ఈ ఘటన జరగడం గమనార్హం.క్వాడ్ సమ్మిట్(QUAD Summit) కోసం మోడీ సెప్టెంబర్ 20న US పర్యటనకు వెళ్లనున్నారు. క్వాడ్ సదస్సు జరిగే ప్రాంతానికి కొద్దీ దూరంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. భారత్‌పై వ్యతిరేకతతో ఖలిస్థానీ ఉగ్రవాదులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉంటే..స్వామినారాయణ్ టెంపుల్ పై జరిగిన దాడిని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్(Consulate General of India) తీవ్రంగా ఖండించింది.స్వామినారాయణ దేవాలయాన్ని విధ్వంసం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఈ హేయమైన చర్యకు పాల్పడిన వారిపై వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని అక్కడి పోలీసులను డిమాండ్ చేసింది. మరోవైపు న్యూయార్క్‌లోని BAPS హిందూ దేవాలయంపై జరిగిన దాడిపై దర్యాప్తు జరిపించాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ అమెరికా న్యాయ శాఖను కోరింది.న్యూయార్క్‌లో దేవాలయంపై జరిగిన విధ్వంస ఘటన కాలిఫోర్నియా(California),కెనడా(Canada)లలో జరిగిన దేవాలయాలపై జరిగిన దాడులకు సమానమని 'X' లో పేర్కొంది.