Google vs EU: గూగుల్‌పై మ‌రోసారి చర్యలకు సిద్ధమవుతున్న యూరోపియ‌న్ యూనియ‌న్..!

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్‌(Google)కు యూరోపియ‌న్ యూనియ‌న్(EU) నుంచి మ‌రో భారీ ఎదురుదెబ్బ త‌ప్పేలా లేదు.

Update: 2024-09-22 00:46 GMT

దిశ, వెబ్‌డెస్క్:ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్‌(Google)కు యూరోపియ‌న్ యూనియ‌న్(EU) నుంచి మ‌రో భారీ ఎదురుదెబ్బ త‌ప్పేలా లేదు.సెర్చ్ ఇంజిన్‌లో అన్ని సంస్థ‌ల‌కు మరింత ప్రాధాన్యతనిచ్చేందుకు గూగుల్ వేగంగా స్పందించ‌క‌పోతే భారీ జ‌రిమానాతోపాటు బిజినెస్ మోడ‌ల్ మార్పుల‌పై ఆదేశాలు ఇచ్చే అవ‌కాశం ఉన్నట్టు EU అధికారులు చెబుతున్నారు. గూగుల్ ఫ్లైట్స్‌, హోటల్స్ వంటి స‌ర్వీసుల్లో గూగుల్ సెర్చ్‌లో చూపించే ఫ‌లితాల స‌ర‌ళికి వ్య‌తిరేకంగా ఈయూ అధికారులు(EU officials) ఛార్జిషీట్(chargesheet) సిద్ధం చేస్తోంది.అలాగే యూరోపియ‌న్ యూనియ‌న్ నిబంధనలకు విరుద్ధంగా గూగుల్‌ పనిచేస్తే తమ వార్షిక ఆదాయంలో 10 శాతం వరకు భారీ జరిమానాలను ఎదుర్కోవలసి ఉంటుందని EU హెచ్చరించ్చింది. 


Similar News