ఇటలీ ప్రధానిగా Giorgia Meloni ప్రమాణ స్వీకారం

ఇటలీ నూతన ప్రధానిగా జార్జియా మెలోని శనివారం ప్రమాణస్వీకారం చేశారు. దేశ చరిత్రగా పీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా నిలిచారు.

Update: 2022-10-22 12:52 GMT

రోమ్: ఇటలీ నూతన ప్రధానిగా జార్జియా మెలోని శనివారం ప్రమాణస్వీకారం చేశారు. దేశ చరిత్రగా పీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా నిలిచారు. నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ అధినేత మెలోనీ గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మాజీ ప్రీమియర్ సిల్వియో బెర్లుస్కోనీ నేతృత్వంలోని ఫోర్జా ఇటాలియా, మాటియో సాల్విని లీగ్‌తో కూడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గణతంత్రానికి విశ్వాసంగా ఉంటానని ప్రమాణం చేస్తున్నానని అన్నారు. ఆ తర్వాత అధ్యక్షుడు సెర్గియో మాటారెల్లాతో కరాచలనం చేశారు. అంతకుముందు రోజు సాంప్రదాయం ప్రకారం అధ్యక్షుడితో మెలోని తన మిత్రపక్షాలతో కలసి సమావేశమయ్యారు. కాగా, తాము ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తామని మెలోని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఆమె మిత్రపక్షాలు మాత్రం గతంలో రష్యా అధ్యక్షుడికి సన్నిహితంగా వ్యవహరించారు.

Tags:    

Similar News