UK న్యూ స్పేస్‌సెంటర్ లో అగ్ని ప్రమాదం.. రాకెట్ లాంచ్ చేసే సమయంలో పేలిన ఇంజిన్

Fire at UK's new spacecentre. Engine exploded during rocket launch

Update: 2024-08-21 00:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతరిక్ష రంగంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న UK కు ఎదురుదెబ్బ తగిలింది.వివరాల్లోకెళ్తే ఈ ఏడాది చివర్లో UK తన మొదటి నిలువు రాకెట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని భావిస్తోంది.ఈ నేపథ్యంలో ఉత్తర స్కాట్లాండ్‌లోని కొత్త స్పేస్‌పోర్ట్‌లో ప్రయోగానికి ముందున్న ట్రయల్స్‌లో భాగంగా పరీక్ష చేసే సమయంలో రాకెట్ ఇంజిన్ పేలిపోయింది.సోమవారం సాయంత్రం జరిగిన సంఘటనలో ఎవరూ గాయపడలేదని రాకెట్ ఆపరేటర్, జర్మన్ రాకెట్ తయారీదారు రాకెట్ ఫ్యాక్టరీ ఆగ్స్‌బర్గ్ (RFA)అనే సంస్థ వెల్లడించింది. అలాగే రాకెట్ లాంచ్ ప్యాడ్ సురక్షితంగా ఉందని, ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉందని ఆ సంస్థ తెలిపింది.

SaxaVord కు చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ప్రమాదానికి గల కారణాలను త్వరలోనే తెలుసుకుంటామని అలాగే ఈ పరీక్ష విఫలమైన కూడా RFAతో కలిసి పని చేస్తామని, వారికి ఎల్లప్పుడూ మా మద్దతు ఉంటుందని తెలిపారు. SaxaVord అనేది యూరప్‌లో పూర్తిగా లైసెన్స్ పొందిన మొదటి వర్టికల్ రాకెట్ ప్రయోగ స్పేస్‌పోర్ట్. కాగా UK లో రాకెట్ ప్రయోగాలు చేసుకోవడానికి SaxaVord కంపెనీకి గత సంవత్సరం డిసెంబర్ 2023లో ఏవియేషన్ అధికారులు అనుమతి ఇచ్చారు. ప్రతి సంవత్సరం 30 వరకు ఉపగ్రహాలను అలాగే ఇతర పేలోడ్ లను అంతరిక్షంలోకి పంపడానికి అధికారులు అనుమతిచ్చారు. 


Similar News