నాటోలో అధికారంగా చేరిన ఫిన్లాండ్

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ పరిస్థితులు నేపథ్యంలో మంగళవారం ఫిన్లాండ్ అధికారికంగా... Finland Joins NATO As The 31st Member Of US-Led Alliance

Update: 2023-04-04 16:15 GMT
నాటోలో అధికారంగా చేరిన ఫిన్లాండ్
  • whatsapp icon

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ పరిస్థితులు నేపథ్యంలో మంగళవారం ఫిన్లాండ్ అధికారికంగా నాటో మిలిటరీ కూటమిలో చేరింది. దీంతో రష్యాతో నాటో పంచుకునే సరిహద్దు పొడవును దాదాపు రెట్టింపు చేయనుంది. మరోవైపు ఉక్రెయిన్‌లో యుద్ధం ఎటువంటి స్పష్టత లేకుండా సాగుతున్నందున క్రమంలో తూర్పు సరిహద్దులను బలోపేతం చేయనుంది. మరోవైపు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ ఫిన్లాండ్ చేరికను స్వాగతించారు. త్వరలోనే స్వీడెన్ కూడా పూర్తి స్థాయిలో చేరనుందని చెప్పారు. మరోవైపు ఫిన్లాండ్ ను చేర్చుకోవడంపై తీవ్ర పరిస్థితులు ఎదుర్కోక తప్పదని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్‌లో మరింత దూకుడుగా వ్యవహరిస్తామని రక్షణ మంత్రి సెర్జెయ్ షోగు తెలిపారు. మరోవైపు యూఎస్ నాయకత్వంలోని నాటో కూటమిలో చేరిన 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ నిలిచింది. 

Tags:    

Similar News