ఫిన్లాండ్ ప్రధానికి షాక్..
ఫిన్లాండ్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని సనా మారిన్‌కు పరాజయం ఎదురైంది.
హెల్సింకీ: ఫిన్లాండ్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని సనా మారిన్‌కు పరాజయం ఎదురైంది. స్వల్ప మార్జిన్‌తో ఆమె పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. ఫిన్లాండ్ ప్రధాన కన్సర్వేటివ్ నేషనల్ కోలేషన్ పార్టీ 20.8 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా, రైట్ వింగ్ పాపులిస్ట్ ధి ఫిన్స్ 20.1 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఇక మారిన్‌కు చెందిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ 19.9 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. మొత్తం 200 స్థానాల్లో ఎన్సీపీ 48, ఫిన్స్ పార్టీ 46, మారిన్ పార్టీ 43 స్థానాల్లో విజయం సాధించింది. అయితే వీటిలో ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చలు జరుగుతున్నాయని ఎన్సీపీ నేత పెట్టెరీ ఒర్ఫో తెలిపారు. ఎన్సీపీ అధ్యక్షతన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. మరో వైపు నూతన ప్రధానిగా ఒర్ఫో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నాయి.
Also Read..