Khaleda Zia : ఐదేళ్ల గృహ నిర్బంధం తర్వాత తొలిసారి స్వేచ్ఛగా ఇంట్లోకి ఖలీదా జియా

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా నిష్క్రమించిన తర్వాత బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

Update: 2024-08-21 19:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా నిష్క్రమించిన తర్వాత బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆగస్టు 5నే జైలు నుంచి విడుదలైన హసీనా రాజకీయ విరోధి ఖలీదా జియా(79).. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ఎట్టకేలకు బుధవారం ఢాకాలోని తన నివాసానికి చేరుకున్నారు. బంగ్లాదేశ్‌లోని అతిపెద్ద రాజకీయ పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఛైర్ పర్సన్ ఖలీదా జియానే. గతంలో ఆమె ప్రధానమంత్రిగానూ దేశానికి సేవలందించారు.

షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ పాలనా కాలంలో ఖలీదా జియాపై ఎన్నో కేసులు బనాయించారు. దాదాపు గత ఐదేళ్లుగా ఆమెను గృహ నిర్బంధంలోనే ఉంచారు. షేక్ హసీనా దేశం నుంచి వెళ్లిపోగానే ఖలీదా జియాకు అనుకూలంగా కోర్టులు, తాత్కాలిక ప్రభుత్వ వర్గాల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆమెను విడుదల చేశారు. అంటే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు జియా తన ఇంట్లో తాను స్వేచ్ఛ ఉండగలుగుతారన్న మాట.

Tags:    

Similar News