పేరు మార్చుకుంటే రూ.100 కోట్లు.. ఎలాన్ మస్క్ వింత ఆఫర్

సెన్సేషనల్ డిసిషన్స్ తో తరచూ వార్తల్లో నిలిచే ఎక్స్ (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ వికీపీడియా ఫౌండేషన్ కు వెరైటీ ఆఫర్ ఇచ్చారు. వీకీపీడియా తన పేరును మారు మార్చుకుంటే నేను వారికి బిలియన్ డాలర్లు ఇస్తాని అంటూ ట్వీట్ చేశారు.

Update: 2023-10-23 06:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సెన్సేషనల్ డిసిషన్స్‌తో తరచూ వార్తల్లో నిలిచే ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ వికీపీడియా ఫౌండేషన్‌కు వెరైటీ ఆఫర్ ఇచ్చారు. వీకీపీడియా తన పేరును మారు మార్చుకుంటే నేను వారికి బిలియన్ డాలర్లు ఇస్తాని అంటూ ట్వీట్ చేశారు. ఓ నెటిజన్ పోస్టుకు స్పందించిన ఎలాన్ మస్క్.. వికీపీడియా తరచూ డబ్బులు అడుగుతోంది.. ఆ ఫౌండేషన్‌కు అంత డబ్బు అవసరం ఏముందని మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? వీకీపీడియా నిర్వహణకు డబ్బు అవసరం లేకపోయినా మరి ఎందుకోసం విరాళాలు అడుగుతోంది? ప్రశ్నించారు.

వీకీపీడీయా తన పేరును డిక్కీపీడియాగా మార్చాలని.. ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే రూ. 100 కోట్లు ఇస్తానని ఆఫర్ చేశారు. ఎలాన్ మస్క్ ప్రతిపాదనపై ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ మీరు ఇస్తామన్న డబ్బు అందిన వెంటనే వీకీపీడియా తిరిగి పాత పేరుకు మారిపోవచ్చు కదా అని అడుగగా దానికి మస్క్ బదులిస్తూ.. నేనేమైనా ఫూల్ నా కనీసం ఓ ఏడాది పాటైనా తాను సూచించిన పేరు కొనసాగించాలని చెప్పారు.

Tags:    

Similar News