6.8 తీవ్రతతో చైనా సరిహద్దు సమీపంలో భారీ భూకంపం..

చైనా సరిహద్దుకు సమీపంలో భారీ భూకంపం సంబవించింది. దీంతో రెక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో ఈ భూకంపం తజికిస్థాన్‌ను తాకింది.

Update: 2023-02-23 02:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనా సరిహద్దుకు సమీపంలో భారీ భూకంపం సంబవించింది. దీంతో రెక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో ఈ భూకంపం తజికిస్థాన్‌ను తాకింది. కాగా చైనాలోని పశ్చిమ జింజియాంగ్ ప్రాంతానికి సమీపంలోని తూర్పు తజికిస్థాన్‌లో గురువారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం తజికిస్థాన్‌లోని ముర్గోబ్‌కు పశ్చిమాన 67 కిలోమీటర్లు (41 మైళ్లు), 20 కిలోమీటర్ల (12 మైళ్లు) లోతులో సంభవించినట్లు సర్వే తెలిపింది.

అలాగే.. ఈ భూకంపం భూకంపం 7.2 తీవ్రతతో 10 కిలోమీటర్లు (6 మైళ్లు) లోతులో ఉన్నట్లు చైనా భూకంప నెట్‌వర్క్‌ల కేంద్రం తెలిపింది. అయితే వివిధ ఏజెన్సీల ప్రాథమిక భూకంప కొలతలు తరచుగా విభిన్నంగా ఉన్నాయి. ఈ భారీ భూకంపంలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిలిందో ఇంకా తెలియరాలేదు.


Similar News