పాకిస్థాన్‌కు రుణం ఇవ్వొద్దు: ఐఎంఎఫ్‌కు ఇమ్రాన్ ఖాన్ లేఖ
పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఆడిటిండ్ నిర్వహించే వరకు పాక్‌కు రుణం మంజూరు చేయొద్దని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్)ను కోరారు.
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఆడిటిండ్ నిర్వహించే వరకు పాక్‌కు రుణం మంజూరు చేయొద్దని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్)ను కోరారు. ఈ మేరకు ఐఎంఎఫ్‌కు ఓ లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి రుణం మంజూరు చేస్తే ఆర్థిక కష్టాలను మరింత పెంచుతుందని తెలిపారు. దేశం పేదరికంలో కూరుకుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. కాబట్టి పాక్‌కు రుణం ఇచ్చేముందు ఆడిటింగ్ చేపట్టాలని కోరారు. దేశంలో గణనీయమైన పెట్టుబడులు లేకుంటే, రుణాల భారం పెరుగుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రుణం కోసం పాక్‌తో చర్చలు కొనసాగించే ముందు ఎన్నికల ఆడిట్‌కు పిలవాలని ఇమ్రాన్ నిర్ణయించినట్టు సెసెటర్ అలీ జాఫర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇమ్రాన్ లేఖపై పీఎంఎల్ఎన్ నేత పాక్ మాజీ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ స్పందించారు. ఇమ్రాన్ లేఖకు ఎలాంటి ప్రాముఖ్యతా లేదని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇమ్రాన్ పాకులాడుతున్నారని విమర్శించారు. కాగా, గతేడాది పాక్ కు ఐఎంఎఫ్ ఆర్థిక సాయం ప్రకటించింది.