ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవద్దు: పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పాకిస్థాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా పాక్‌కు వార్నింగ్ ఇచ్చింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పాకిస్థాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా పాక్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవద్దని, ఒక వేళ ఏదైనా అగ్రిమెంట్‌కు సిద్ధమైతే తాము భారీగా ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అంతేగాక ఇతర ఒప్పందాలకు కూడా అంతరాయం కలిగిస్తామని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ పటేల్ తెలిపారు. ‘నెట్‌వర్క్‌ల విస్తరణ, సామూహిక విధ్వంసక ఆయుధాల సేకరణ వంటి కార్యకలాపాలకు సంబంధించి అగ్రిమెంట్ ఎక్కడ జరిగినా వాటికి అంతరాయం కలిగిస్తాం. చర్యలు తీసుకోవడం కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు. ఇరాన్‌తో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలనే ఎవరికైనా ఈ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి తయారీకి పరికరాలను సరఫరా చేసే సంస్థలపైనా యూఎస్ ఇటీవల ఆంక్షలు విధించింది. చైనా, బెలారస్‌లలో ఉన్న ఈ సంస్థలు సామూహిక విధ్వంసక ఆయుధాల తయారీని ప్రోత్సహిస్తున్నాయని తెలిపింది. కాగా, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పాకిస్థాన్‌లో ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో సహా ఉన్నతాధికారులతో పలుసార్లు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య పరిమాణాన్ని 10బిలియన్ డాలర్లకు పెంచేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. దీంతో పాటు ఎనిమిది ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.