Donald Trump: ట్రంప్ పూర్తి నిరాశలో ఉన్నారు..సారా మాథ్యూస్ కీలక వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అతని మాజీ సహాయకుడు సారా మాథ్యూస్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ ప్రెసిడెంట్ రేస్‌లో ఉన్న ట్రంప్ ప్రస్తుత ఎన్నికలు తన నుంచి జారిపోతున్నాయని భావిస్తున్నాడని తెలిపారు.

Update: 2024-08-14 15:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అతని మాజీ సహాయకుడు సారా మాథ్యూస్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ ప్రెసిడెంట్ రేస్‌లో ఉన్న ట్రంప్ ప్రస్తుత ఎన్నికలు తన నుంచి జారిపోతున్నాయని భావిస్తున్నాడని తెలిపారు. అందుకే తన రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. బుధవారం ఓ మీడియా చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాథ్యూస్ మాట్లాడారు. ట్రంప్ ప్రత్యర్థి‌‌ కమలా హ్యారీస్ ర్యాలీలు, ప్రచార కార్యక్రమాల్లో ప్రజలను ఉత్సాహ పరుస్తుంటే ట్రంప్ వాటన్నింటినీ తోసి పుచ్చుతున్నారని తెలిపారు. ప్రచారం సందర్భంగా ట్రంప్ చేసే ప్రసంగాలు ఆకట్టుకునేంతగా లేవని స్పష్టం చేశారు. నిరాశలో ఉన్నప్పుడు మాత్రమే అలాంటి సందేశాలు వస్తాయని వెల్లడించారు.

తన ప్రచారానికి హాని కలిగించే సందేశాలను సైతం ట్రంప్ స్వీకరించిన సందర్భాలు ఉన్నాయన్నారు. దాడికి గురైన తర్వాత అర్థం లేని విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాగా, ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష. ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మాజీ అధ్యక్షుడు ట్రంప్, యూఎస్ ఉపాధ్యక్షురాలు కమల హ్యారీస్ బరిలో నిలిచారు. ఇప్పటికే వీరిద్దరూ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే పలు సభల్లో ట్రంప్ పలువురు ప్రతినిధులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సారా మాథ్యూస్‌పై వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News