Hezbollah : హిజ్బుల్లా ప్రతీకారం.. ఇజ్రాయెల్‌పైకి రాకెట్ల వర్షం
దిశ, నేషనల్ బ్యూరో : లెబనాన్‌లో పేజర్ పేలుళ్ల వెనుక ఉన్నది తామేనని ఇజ్రాయెల్(Israel) ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు(Netanyahu) ప్రకటించడంతో హిజ్బుల్లా(Hezbollah) మిలిటెంట్ సంస్థ అగ్గిమీద గుగ్గిలం అయింది.
దిశ, నేషనల్ బ్యూరో : లెబనాన్‌లో పేజర్ పేలుళ్ల వెనుక ఉన్నది తామేనని ఇజ్రాయెల్(Israel) ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు(Netanyahu) ప్రకటించడంతో హిజ్బుల్లా(Hezbollah) మిలిటెంట్ సంస్థ అగ్గిమీద గుగ్గిలం అయింది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోయి.. ఉత్తర ఇజ్రాయెల్‌పైకి సోమవారం దాదాపు 165 రాకెట్లను ప్రయోగించింది. ఈ రాకెట్లు జనావాస ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. రాకెట్లు పడి కొన్ని కార్లు కాలిపోయాయి. ఇంకొన్ని రాకెట్లు ఇళ్లపై పడి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనల్లో ఏడుగురు ఇజ్రాయెలీలు గాయాలపాలయ్యారు. వారిలో ఏడాది శిశువు కూడా ఉంది.
గెలీలీ ప్రాంతంలోని పలు పట్టణాలపై హిజ్బుల్లాకు చెందిన 50 రాకెట్లు పడ్డాయని ఇజ్రాయెలీ ఆర్మీ వెల్లడించింది. 90 రాకెట్లను ఇజ్రాయెల్ పోర్ట్ సిటీ హైఫాపైకి హిజ్బుల్లా సంధించింది. వెంటనే అలర్ట్ అయిన ఇజ్రాయెలీ ఆర్మీ.. ఆ రాకెట్లను ప్రయోగించేందుకు వాడిన హిజ్బుల్లా రాకెట్ లాంచర్‌ను డ్రోన్‌తో ధ్వంసం చేసింది. ఈ దాడులను హిజ్బుల్లా కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ పరిధిలోని కార్మెయిల్ సెటిల్‌మెంట్‌లో ఉన్న సైనిక శిక్షణా కేంద్రం లక్ష్యంగా రాకెట్ దాడులు చేశామని వెల్లడించింది.