Trump : ట్రంప్‌కు భద్రతాలోపం మా వైఫల్యమే : అమెరికా సీక్రెట్ సర్వీస్ చీఫ్

దిశ, నేషనల్ బ్యూరో : రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌‌కు భద్రత కల్పించడంలో తాము విఫలమయ్యామని అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం డైరెక్టర్ కింబర్లీ ఛీట్లే అంగీకరించారు.

Update: 2024-07-22 18:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో : రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌‌కు భద్రత కల్పించడంలో తాము విఫలమయ్యామని అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం డైరెక్టర్ కింబర్లీ ఛీట్లే అంగీకరించారు. జులై 13న పెన్సిల్వేనియా రాష్ట్రంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రతాలోపం గురించి వివరణ ఇచ్చేందుకు ఆమె సోమవారం వాషింగ్టన్‌లోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పర్యవేక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఈసందర్భంగా కింబర్లీ ఛీట్లే వివరణ ఇస్తూ.. ‘‘మేం విఫలమయ్యాం. జులై 13న ట్రంప్‌పై కాల్పులు జరగడం అనేది మాకు చాలాపెద్ద వైఫల్యం’’ అని తెలిపారు.

నిఘా వర్గాల సమాచారం మేరకు.. ఈ కాల్పులు జరగడానికి కొన్ని వారాల ముందే ట్రంప్‌కు తాము భద్రతను పెంచిన విషయాన్ని ఛీట్లే గుర్తు చేశారు. ‘‘మా మిషన్ రాజకీయపరమైంది కాదు. అది చావుబతుకులకు సంబంధించిన అంశం’’ అని ఆమె తెలిపారు. ఛీట్లే స్టేట్మెంట్‌పై హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మైక్ జాన్సన్ ఘాటుగా స్పందించారు. ‘‘వెంటనే ఛీట్లేను పదవి నుంచి తప్పించాలని బాధ్యత బైడెన్‌‌పై ఉంది. కేవలం కొన్ని మిల్లీమీటర్ల గ్యాప్‌తో ట్రంప్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లే గండం తప్పింది’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 2022 ఆగస్టులో అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం డైరెక్టర్‌గా కింబర్లీ ఛీట్లేను నియమించారు.

Tags:    

Similar News